Friday, March 18, 2016

అరాశ "సాయిమాట చక్కని బాట"


అరాశ

సాయిమాట చక్కని బాట
(సాయిబోధ గేయఖండికలు)

(1)
 శ్రీ గౌరీ తనయ వినాయక
జయజయహో శ్రిత ఫల దాయక
నీకు మ్రొక్కి సాయి ప్రభోదము
రచియింపగ పూనితి  గనుమూ
ప్రతి పలుకున నీవే నిలచి
అద్భుతమౌ భావము గూర్చి
నను ధన్యుని సేయు గజానన
నీ దయ కురిపించు నిర్గుణా

(2)
శ్రీ రామా సీతారామా
కౌసల్యా తనయ శ్యామా 
నీ కరుణే సతతం నాపై
కురిపించగ కోరితి రామా
నీవే నా సర్వస్వమ్మని
నీకే నే నంకితమ్మని
అడుగడున స్మరియిస్తాను
అణువణువున దర్శిస్తాను
               
 (3)
సాయి బోధనామృతమూ
చదువగలుగు సుకృతమూ
ఆచరించి అనుభవించిన
భక్త జన్మ ధన్యమూ

(4)
ఆధారము నేనని నమ్మి 
మీ భారము నాపై వేసి
నా నామాము జపియించినచో
మీ కోర్కెలనీడేర్చదను
మిము సతతము కాపాడెదను

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(5)
నాకథలను వినువేళ
ఆనందము కలిగించెదను
నాలీలలు గానము చేస్తే
సంతృప్తిని మీకొసగెదనూ
నన్నే శరణాంచు వేడగా
భవబంధము బాపేస్తాను
నారూపము మది నిలిపినచో
సుఖసంతసమందిస్తాను

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(6)
దుర్మార్గుల దుష్టులజేరక
సజ్జనులతోవినయము వీడక
మనసారగ నను పూజిస్తే
మీకిల లోటేముంటుంది
మీ యోచన నామీదైతే
నాచూపులు మీ పైనే
యే సమయమునే యెడయున్నా
మీ రక్షణ భారము నేనే

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(7)
అణువణువున నేనున్నాను
అంతటనే నెలవైనాను
చరాచర జగత్తునంత
ఆవరించి నిలుచున్నాను
అన్నిటికీ సూత్రధారిని
అన్నిటిలో పాత్రధారిని
సృష్టి స్థితి లయకారకుడను
నిష్టనియమ భక్తి దాసుడను

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(8)
భక్తి ప్రేమ మీలోఉంటే
అంతులేని నమ్మకముంటే
ఈ షిరిడియె పండరి పురము
శ్రీ కృష్ణుని ద్వారక నగరము
ఆ విఠలుని నేనే కాదా
దరిశనమే భవహరమవదా
నాపాదయుగళము లోన
గంగ యమున జననమొందదా

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(9)
కీర్తి ప్రతిష్టల సాధనకై
ప్రాకులాటమీకెందులకు
దైవ కృపాకటాక్షములకై
యత్నిస్తూ సాగు ముందుకు
ధనమును సంపాదించుటకూ
గృహమును సంరక్షించుటకూ
దేహమునూ పోషించుటకూ
జీవితమును వ్యర్థము సేయకు

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(10)
సతతము నన్నారధించే
భక్తులమది కొలువౌతాను
వారి యింట అన్న వస్త్రముల
లోటులేక అలరిస్తాను
ఇష్టదేవతా రూపముతో
దరిశనమూ గావిస్తాను
సత్సాంగత్యము గల మనసుకు
శాంతి నొసగిరక్షిస్తాను

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(11)
పేరాశ అసూయ లోభము
అభిమానము అహంభావము
ధనదాహముదుఃఖమానసము
వదలిన కనిపించు బ్రహ్మము
ఫలాపేక్ష రహితముగాని
జ్ఞానము ఇల నిష్ప్రయోజనము
ఇంద్రియ లోలత్వము మాని
మనసు శుద్ధినొందిన సఫలము

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(12)
నీయోచన నా పరమైతే
నీ ప్రతి పని నా సేవైతే
విశ్వాసము నీ పూజైతే
మంత్రముతో పనియేముంది
తాబేలు చల్లని చూపులు
పిల్లలను పెంచినట్టుల
గురుదేవుని దయగను చూడ్కులె
లోకానికి సఫలత కాదా

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(13)
షోడశోపచారాలొద్దు
అష్టాంగ యోగాలొద్దు
ఒక్కసారి సాయీ అంటే
జన్మాంతర పాపము రద్దు
భక్తిఉన్న హృదయము లోన
నిత్యం నే కొలువై ఉంట
భక్తికి నే దాసుడినంట
భక్తులకే సేవకునౌతా

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(14)
మీకు పీఢబాధలున్ననూ
మీకెంతటి కష్టమున్ననూ
ఈ మసీదు మెట్లు ఎక్కితే
నిముసమునవి నిష్క్రమించును
ఈ ఫకీరు కరుణా హృదయుడు
రోగములెడబాపు వైద్యుడు
మీ మదిలో గల కోరికలు
తృటిలోన తీర్చు సద్గురుడు

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(15)
రాముడైన రహీమెయైనా
ఒక్కడనే మాటనిజం
కలిసిమెలిసి జీవించుటయే
మక్కువైన మానవిజం
యోగ యాగ త్యాగాలు
మోక్షానికి సోపానాలు
దీనులకు చేసినమేలు
అంతకన్న సత్కారాలు

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(16)
హిందువుగా నను తలచేరో
ముస్లిముగా భావించేరో
మీ గురువుగ మదినెంచేరో
సహవాసిగ అనుకుంటారో
ఎలా నన్ను భావన సలిపిన
నేను మీకు దాసుడనూ
మీ యోగ క్షేమము కోరే
నేననాథ నాథుడను 

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(17)
నా భక్తుల బాధలు నావి
వారొందే దుఃఖము నాది
వారి అనారోగ్యమునాది
వారి పూర్ణా భారమునాది
భక్తులమది నేనెరుగుదును
కోరకయే కోర్కెలుదీర్తును
చెడు ప్రవర్తనమును గాంచిన
తొలగించి సంస్కరించెదను

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(18)
ప్రతి జీవి హృదయమున
నారూపము గమనించాలి 
వాటి కొరకు చేసిన సేవ 
నా సేవని మదినెంచాలి
కుక్క పిల్లి ఈగ ఆవు
మొదలైన జంతు తతులకు
ప్రేమ తోడనిడు ఆహారము 
నాకొసగే ప్రి నైవేద్యము

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(19)
ఆకలన్న ఆహారమును
దాహమన్నచో నీరమును
లేక కోరు వేళ వస్త్రమును
ఇచ్చిన భగవంతునికిష్టము
పరుషముగా పలుకగరాదు
కఠినత్వము చూపగరాదు
ప్రేమతో తోడ్పాటు నొసగుతూ
జీవించుట మానవ లక్ష్యము

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(20)
కౄరమైన జంతు జాలమును
విష కీటక సర్పకోటిని
భగవంతుడు సృష్టించాడు 
జీవించగ వరమిచ్చాడు
శివునాజ్ఞకు లోబడి జగము
సంచరించుచున్నది నిజమూ
అంతటినీ ప్రేమించెదమూ
ఓరిమితో జీవించెదమూ

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(21)
మనసు పవిత్రతనొందనిదీ
పారాయణ చేస్తేం లాభం
సమతను అలవరచు కోనిదీ 
మమతొకటుంటేం ప్రయోజనం
పరులకింత పెట్టనప్పుడు
శ్రీమంతుడివైతేం లాభం
బ్రహ్మ జ్ఞానమును పొందనిది
వేదాధ్యాయివైతేం లాభం

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(22)
జాతకమున ఏముంటేమి
ఏ ఫలితం ఘోషిస్తేమి
సాముద్రికమెట్లుంటేమి
పుట్టుమచ్చలెన్నుంటేమి
నాపైన నమ్మకముంచి
నాకథలను నిత్యము తలచిన
చేసిన ప్రతి కార్యమందున
విజయము సమకూరును సత్యం

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(23)
భాగవత సప్తాహమును
రామరక్ష స్తోత్ర రత్నమును
దత్త చరిత పారాయణమును
ఆధ్యాత్మ రామాయణమును
విష్ణునామ సహస్రమ్మును
ఇంటి దేవతారాధనమును
మరువక స్మరియించెడి జన్మము
భగవానునకమిత ప్రియము

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(24)
ఆరడుగుల రూపముగానో
షిరిడీపుర వాసునిగానో
తిరుపమెత్తు ఫకీరు గానో
భావించుట మీ అజ్ఞానము
సప్త సముద్రాలావల ఉన్న
మీరెచట పయనిస్తున్నా
గాలినీరు నిప్పు నింగిగా
మిము కాచుట నా కర్తవ్యం

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(25)
నా మాటే వేదం సారం
ఈ ఊదే దివ్యౌషధం
ఈ ద్వారక మాయే క్షేత్రం
ఈ షిరిడే స్వర్గపు ధామం
నా చరితే జ్ఞాన ప్రబోధం
ఈధుని అజ్ఞాన నాశకం
మీ భాగ్యం నా సహవాసం
మీ మోక్షం నా వరదానం

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(26)
నన్నే ప్రేమించేవారు
నన్నెపుడూ దర్శిస్తారు
నా చరితము పఠియిస్తారు
నా నామము జపియిస్తారు
నాకొసగే భుజియిస్తారు
శరణాగతి నేనంటారు
వారికి ఋణగ్రస్తుడను
మోక్షమిచ్చి తీర్చుకొనెదను

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ

(27)
సాయీ అని ప్రేమ తొ పిలువగ
నా సమాధి పలుకుతుంది
మీ సమస్య ఏదైనా
సాధనను సూచిస్తుంది
షిరిడీ పురమున గాలైనా
పుణ్యాన్ని మీకిస్తుంది
నా భక్తుల పదధూళైనా
పవిత్రులుగ మార్చేస్తుంది

అని ప్రేమతో అభయము నొసగి
ఆనందము అవనికి నిడిన
సాయి బోధనామృతమూ
చదువ గలుగు సుకృతమూ


మంగళం మహత్
సాయి చరణారవిందార్పణమస్తు

అమరవాది రాజశేఖర శర్మ


,,,,,,


Tuesday, January 12, 2016

సంకీర్తనం

                     శ్రీ వేంకటేశ్వర భక్తి సంకీర్తనం

          రచన: అమరవాది రాజశేఖర శర్మ ( అరాశ )